ఏకాంశ కవిత్వం-275వ వారం- అంశం: తరాల మధ్య అంతరం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1728వ రోజు ‘తరాల మధ్య అంతరం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, నగునూరి రాజన్న, డా.సి.వసుంధర, కోలా సత్యనారాయణ, గుర్రాల వేంకటేశ్వర్లు రాసిన కవితలు 2026 మార్చి 26వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:
Post a Comment