Monday 31 December 2018

అసాధారణ సాహితీమూర్తి ఇనాక్































కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి బహుముఖీన సృజనపై నేను రాసిన వ్యాసం 2018 డిసెంబరు 31 'మన తెలంగాణ' దినపత్రిక 'కలం' పేజీలో ప్రచురితం

Wednesday 19 December 2018

భారీ విజయానికి బలమైన కారణాలు

తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికార పక్ష విజయంపై నా వ్యాసం
2018 డిసెంబరు 19 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.  

Monday 17 December 2018

ఆంగ్ల సాహిత్యంలో ఎగరేసిన భారతీయ జెండా అమితావ్

జ్ఞానపీఠ పురస్కారాన్ని తొలిసారిగా ఆంగ్ల సాహిత్యానికి పొందిన ప్రముఖ రచయిత అమితావ్ ఘోష్ పై నా వ్యాసం 2018 డిసెంబరు 17 మన తెలంగాణ దినపత్రిక 'కలం' పేజీ లో ప్రచురితం.

Wednesday 31 October 2018

కారు మబ్బుల నుండి కాంతి రేఖల ప్రసారం - వట్టికోట జీవితం అందించే సందేశం

నవంబరు 1న వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి. 
ఈ సందర్భంగా నేను రాసిన ప్రత్యేక వ్యాసం 2018 నవంబరు 1 'నేటి నిజం' దినపత్రికలో ప్రచురితం. 

Monday 29 October 2018

'ప్రజల మనిషి'లో జైలు జీవితం

నవంబరు 1న ప్రముఖ రచయిత వట్టికోట ఆళ్వార్ స్వామి జయంతి. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం నేటి (2018 అక్టోబరు 29) 'మన తెలంగాణ' దినపత్రిక సాహిత్య అనుబంధం 'కలం' పేజీలో ప్రచురితం.

Thursday 11 October 2018

తెలంగాణ ప్రజల గొంతుక నందిని సిధారెడ్డి























తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి గారి సాహిత్యం పై 2018 అక్టోబరు 11, 12 తేదీల్లో  జాతీయ సదస్సు జరుగుతున్న సందర్భంగానేను రాసిన ప్రత్యేక వ్యాసం 2018 అక్టోబరు 11 'నేటి నిజం' దినపత్రికలో ప్రచురితం.

Monday 17 September 2018

కవితా ప్రవాహపు మూలమలుపు

ప్రముఖ కవి డా.ఏనుగు నరసింహా రెడ్డి గారి 'మూలమలుపు' కవితా సంపుటిపై నేను రాసిన సమీక్ష
2018 సెప్టెంబరు 17 'ఆంధ్ర ప్రభ' దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ గవాక్షం'లో ప్రచురితం.

Thursday 6 September 2018

చైతన్యానికి దర్పణం కాళోజీ జీవితం

































సెప్టెంబరు 9న కాళోజీ జయంతి. 
ఈ సందర్భంగా నా వ్యాసం 'నేటి నిజం' దినపత్రిక 2018 సెప్టెంబరు 6 సంచికలో ప్రచురితం.

Wednesday 22 August 2018

సామాజిక శాస్త్రవేత్తకు రంగాచార్య పురస్కారం


దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ఈ నెల 24న ప్రముఖ రచయిత, తెలంగాణ బి.సి. కమీషన్ ఛైర్మన్ బి.ఎస్.రాములు గారికి యువకళావాహిని సంస్థ దాశరథి రంగాచార్య స్మారక పురస్కారాన్ని అందజేయనుంది. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం 2018 ఆగస్టు 23 'నేటి నిజం' పత్రికలో ప్రచురితం.

Monday 20 August 2018

భావావేశ కవి అటల్ జీ

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి కవిత్వంపై నా వ్యాసం 

2018 ఆగస్టు 20 'మన తెలంగాణ' దినపత్రిక 'కలం' పేజీలో ప్రచురితం. 

Friday 17 August 2018

ప్రజాకవులను వెలుగులోకి తెచ్చిన పరిశోధకులు ఎస్వీ




ఆగస్టు 16న తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ గారి పుట్టినరోజు. 
ఈ సందర్భంగా 2018 ఆగస్టు 16 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితమైన నా వ్యాసం.

Monday 6 August 2018

ఒకటిన్నర శతాబ్దాల తెలంగాణ నవల


మన తెలంగాణ దిన పత్రిక సాహిత్య అనుబంధం 'కలం' పేజీలో 

2018 ఆగస్టు 6న ప్రచురితమైన నా వ్యాసం

Friday 27 July 2018

కవిత్వ శివతాండవ మూర్తి


ప్రముఖ కవి వఝల శివకుమార్ గారికి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాశరథి పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేను రాసిన వ్యాసం 2018 జూలై 26 వ తేదీ 'నేటి నిజం' సంచికలో ప్రచురితం.


సంప్రదాయానికి, ప్రయోగానికి లంకె కుదిర్చిన పరిశోధకులు

జూలై 29న ఆచార్య సి.నారాయణరెడ్డి జయంతి. 
ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం 2018 జూలై 26 వ తేదీ 'నేటి నిజం' సంచికలో ప్రచురితం. 

Friday 20 July 2018

'ఆన్ లైన్'కు సర్వామోదం

ఉపాధ్యాయ బదిలీల్లో ఆన్ లైన్ విధానంపై నేను రాసిన వ్యాసం 
2018 జూలై 20వ తేదీ 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.

Thursday 19 July 2018

సంభాషణల్లో ప్రత్యేకత దాశరథి నాటికల స్వభావం





































జూలై 22న మహాకవి దాశరథి జయంతి. ఈ సందర్భంగా ఇటీవల నేను రాసిన వ్యాస పరంపరలో ఇది రెండో వ్యాసం. ఇంతకుముందు దాశరథి కృష్ణమాచార్యుల కథలపై రాశాను. ప్రస్తుత వ్యాసం ఆయన రాసిన నాటికలపై నా విశ్లేషణ. నేటి నిజం దినపత్రిక 2018 జూలై 19వ తేదీ సంచికలో ఈ వ్యాసాన్ని ప్రచురించింది. 

Monday 16 July 2018

తెలంగాణ దర్పణం దాశరథి కథ

ఈ నెల 22న మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి. 
ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం 
2018 జూలై 16 'మన తెలంగాణ' దినపత్రిక సాహిత్య అనుబంధం 
'కలం' పేజీలో ప్రచురితం. 

Wednesday 11 July 2018

తెలంగాణ నీటిపారుదల పితామహుడు

ఈరోజు తెలంగాణ నీటి పారుదల రంగ పితామహుడు అలీ నవాజ్ జంగ్ జయంతి. ఆయన జయంతిని 2014 నుండి తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం నేటి (2018 జూలై 11) 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.

Monday 2 July 2018

కాళోజీ కవితలో తెలంగాణ భాష

'మన తెలంగాణ' దిన పత్రిక సాహిత్య అనుబంధం 'కలం'పేజీ, 2018 జూలై 2.

Wednesday 27 June 2018

ఆన్ లైన్ బదిలీల్లో ఆవశ్యక మార్పులు

ఉపాధ్యాయ బదిలీల్లో నూతన విధానంపై నేను రాసిన వ్యాసం
నేటి (2018 జూన్ 27) ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.

Thursday 21 June 2018

Friday 15 June 2018

రాళ్లలోని కళ్లను, బండల చాటున గుండెలను ఆవిష్కరించిన కవి (డా.సి.నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా వ్యాసం)

ఈ నెల 12న డా.సి.నారాయణరెడ్డి వర్ధంతి.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేను రాసిన వ్యాసం
'నేటి నిజం' 2018 జూన్ 14 సంచికలో ప్రచురితం.

Wednesday 6 June 2018

వేదాలను ఔపోసన పట్టిన మార్క్సిస్టు (దాశరథి రంగాచార్య పై ప్రత్యేక వ్యాసం)



















జూన్ 8 న దాశరథి రంగాచార్య వర్ధంతి. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం 2018 జూన్ 7 'నేటి నిజం' దినపత్రికలో ప్రచురితం. 

Thursday 24 May 2018

పాఠక హృదయ విజేత (యద్దనపూడి సులోచనారాణిపై వ్యాసం)


 






2018 మే 21న మరణించిన నవలాలోకపు రాణి 

యద్దనపూడి సులోచనారాణి నవలలపై నా వ్యాసం 

(నేటి నిజం దినపత్రిక, 24.05.2018)

Monday 21 May 2018

రెండో బాల్యం (కవిత)


మన తెలంగాణ దినపత్రిక, 21.05.2018

వడివడిగా అడుగులేస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ

తెలంగాణ సాహిత్య అకాడమీ పునర్వ్యవస్థీకరణ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా నేను రాసిన వ్యాసం
'నేటి నిజం' దినపత్రిక 2018 మే 17న ప్రచురితం. 

Monday 9 April 2018

బతుకుపాటల పల్లవి 'కలల సాగు'


ప్రముఖ కవి వఝల శివకుమార్ గారి 'కలల సాగు' కవితా సంపుటిపై నా సమీక్ష
నేటి (2018 ఏప్రిల్ 9) 'మన తెలంగాణ' దినపత్రిక సాహిత్య అనుబంధం 'కలం' పేజీలో ప్రచురితం.

Monday 2 April 2018

సాహిత్య కళానిధి కపిలవాయి (వ్యాసం)

నమస్తే తెలంగాణ దినపత్రిక, 2018 ఏప్రిల్ 2, చెలిమె పేజీ 

Sunday 18 March 2018

ఏం రాయాలి? (కవిత)


ఏం రాయాలి?
.. డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు

ఉగాదీ!
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?
ఎందరో కవుల
కవిత్వ వస్తువువు
నువ్వు
ఎన్నో కవి
సమ్మేళనాలకు
ప్రేరేపణ నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

వణుకుల కాలానికీ
కమిలిన కాలానికీ
సంధి గీతవు
నువ్వు
రెండు కాలాల మధ్య
సన్నటి వంతెనవు
నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

వణుకుల జీవితాలకూ
కమిలిన బతుకులకూ
ఆశాదీపంగా నిలబడే
పర్వానివి నువ్వు
వణికే జీవితాలకు
వెచ్చటి దుప్పటివో
కమిలిన బతుకులకు
మందు పూతవో
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

రాజపూజ్యాలు ఎన్నో
అవమానాలు ఎన్నో
చిట్టా విప్పే
భవిష్యవాణివి నువ్వు
ఆదాయ వ్యయాలకు
తరాజు పట్టే
ఆర్తికవేత్తవు నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?


లక్షల జతల చెవులకు
కేరాఫ్ అడ్రస్ నువ్వు
ఏడాది పయనానికి
తొలి అడుగు నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

ఉగాదీ!
నీపై కొత్తగా కవిత్వం ఏం రాయాలి?


Thursday 15 March 2018

మృత్యువును జయించిన అద్భుత శాస్త్రవేత్త

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణించిన సందర్భంగా ఆయనపై నేను రాసిన వ్యాసం 2018 మార్చి 15 'మన తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం. 

Wednesday 21 February 2018

మరణిస్తున్న భాషలు (మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)






































ఈరోజు (ఫిబ్రవరి 21) అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఎడిషన్ల ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా వ్యాసం.

Tuesday 13 February 2018

సాధికారిక చారిత్రక పరిశోధనా పాత్రికేయులు (జి.వెంకట రామారావు గారిపై ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారి వ్యాసం)

చరిత్ర పరిశోధకులు వెంకట రామారావు గారిపై 
ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారు రాసిన వ్యాసం 
2018 ఫిబ్రవరి 12వ తేదీ 'ఆంధ్ర భూమి' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం. 

Sunday 11 February 2018

అమ్మంగి రచనలు అయస్కాంతాలు


ప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు డా.అమ్మంగి వేణుగోపాల్ గారి సాహిత్య స్వర్ణోత్సవం, సప్తతి సందర్భంగా 'పాలపిట్ట' మాసపత్రిక ప్రత్యేక సంచిక వెలువరించింది. ఆ సంచికలో ప్రచురితమైన నా వ్యాసం.






Monday 5 February 2018

మన వెలుగు దివ్వె















 ఫిబ్రవరి 5న తెలంగాణ వైతాళికులు వట్టికోట ఆళ్వార్ స్వామి వర్ధంతి. 
ఈ సందర్భంగా 2018 ఫిబ్రవరి 5వ తేదీన నమస్తే తెలంగాణ దినపత్రిక సాహిత్య అనుబంధం 'చెలిమె'లో ప్రచురితమైన నా వ్యాసం. 

Thursday 1 February 2018

బడ్జెట్ పై గంపెడాశలు


'ఆంధ్ర జ్యోతి' దినపత్రిక 2018 ఫిబ్రవరి 1- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు ఎడిషన్ల ఎడిట్ పేజీలో ప్రచురితం 

Monday 29 January 2018

వైవిధ్యాల కథానికలు



ఫిబ్రవరి 3న డా.అమ్మంగి వేణుగోపాల్ గారి సాహిత్య స్వర్ణోత్సవం, సప్తతి.
ఈ వేడుకలు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరుగుతాయి. 
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేను రాసిన వ్యాసం 
నేటి (29.01.2018) మన తెలంగాణ దినపత్రిక సాహిత్య అనుబంధం 'కలం'లో ప్రచురితం. 

Sunday 28 January 2018

నేటి తరం నాయకులకు దిక్సూచి పెండ్యాల రాఘవరావు


వరంగల్ మొదటి ఎం.పి. పెండ్యాల రాఘవ రావు గారి శత జయంత్యుత్సవాల ముగింపు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన కృషి పై నేను రాసిన వ్యాసం నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ అర్బన్-రూరల్-జనగామ టాబ్లాయిడ్ లో ప్రచురితం. 

Monday 22 January 2018

కవితా బీజాక్షరాలు చల్లిన 'మిర్గం' (మిర్గం కవితా సంపుటిపై సమీక్ష)


'మిర్గం' కవితాసంపుటిపై నేను రాసిన సమీక్ష- 

నమస్తే తెలంగాణ 'చెలిమె' పేజీ- 2018 జనవరి 22