Sunday 18 March 2018

ఏం రాయాలి? (కవిత)


ఏం రాయాలి?
.. డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు

ఉగాదీ!
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?
ఎందరో కవుల
కవిత్వ వస్తువువు
నువ్వు
ఎన్నో కవి
సమ్మేళనాలకు
ప్రేరేపణ నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

వణుకుల కాలానికీ
కమిలిన కాలానికీ
సంధి గీతవు
నువ్వు
రెండు కాలాల మధ్య
సన్నటి వంతెనవు
నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

వణుకుల జీవితాలకూ
కమిలిన బతుకులకూ
ఆశాదీపంగా నిలబడే
పర్వానివి నువ్వు
వణికే జీవితాలకు
వెచ్చటి దుప్పటివో
కమిలిన బతుకులకు
మందు పూతవో
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

రాజపూజ్యాలు ఎన్నో
అవమానాలు ఎన్నో
చిట్టా విప్పే
భవిష్యవాణివి నువ్వు
ఆదాయ వ్యయాలకు
తరాజు పట్టే
ఆర్తికవేత్తవు నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?


లక్షల జతల చెవులకు
కేరాఫ్ అడ్రస్ నువ్వు
ఏడాది పయనానికి
తొలి అడుగు నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

ఉగాదీ!
నీపై కొత్తగా కవిత్వం ఏం రాయాలి?


Thursday 15 March 2018

మృత్యువును జయించిన అద్భుత శాస్త్రవేత్త

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణించిన సందర్భంగా ఆయనపై నేను రాసిన వ్యాసం 2018 మార్చి 15 'మన తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.