Wednesday 15 May 2024

ఏకాంశ కవిత్వం- 182వ వారం- అంశం: మండు వేసవి- మెండు వర్షం

 

ఏకాంశ కవిత్వం- 182వ వారం- అంశం: మండు వేసవి- మెండు వర్షం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1156వ రోజు ‘మండు వేసవి- మెండు వర్షం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో మధు జెల్లా, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, గుండం మోహన్ రెడ్డి, ఎ.రాజ్యశ్రీ, గుండవరం కొండల్ రావు, జె.నరసింహారావు, నగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి పసుల, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2024 మే 16వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday 8 May 2024

ఏకాంశ కవిత్వం- 181వ వారం- అంశం: మండే ఎండలు

 

ఏకాంశ కవిత్వం- 181వ వారం- అంశం: మండే ఎండలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1152వ రోజు ‘మండే ఎండలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, రాజప్ప, పులి జమున, ప్రశాంతి రేవూరి, లక్ష్మారెడ్డి పసుల, జక్కని గంగాధర్, మోటూరి శాంతకుమారి, చంద్రకళ దీకొండ, రజనీ కులకర్ణి రాసిన కవితలు 2024 మే 9వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday 1 May 2024

అంతర్జాతీయ కార్మిక దినోత్సవ కవితలు - ప్రశాంతి రేవూరి, రజనీ కులకర్ణి తదితరులు రాసిన కవితలు


 మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక                      

అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా 2024 మే 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రిక ప్రత్యేక సంచిక వెలువరించింది.

ఇందులో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదికల సౌజన్యంతో ప్రశాంతి రేవూరి, రజనీ కులకర్ణి తదితరులు రాసిన కవితలు ప్రచురితం.

 కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

ఏకాంశ కవిత్వం- 180వ వారం- అంశం: శ్రామికశక్తి

 

ఏకాంశ కవిత్వం- 180వ వారం- అంశం: శ్రామికశక్తి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1145వ రోజు ‘శ్రామికశక్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, శ్రీలతరమేశ్ గోస్కుల, వి. సంధ్యారాణి, ఆర్. రమాదేవి, నాగరాజు చుండూరి, కె.కె.తాయారు, మధు జెల్లా, ఎ.రాజ్యశ్రీ, లక్ష్మారెడ్డి  పసుల రాసిన కవితలు 2024 మే 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

Wednesday 24 April 2024

ఏకాంశ కవిత్వం- 179వ వారం- అంశం: డబ్బు


 ఏకాంశ కవిత్వం- 179వ వారం- అంశం: డబ్బు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1142వ రోజు ‘డబ్బు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, నగునూరి రాజన్న, కె.కె.తాయారు, లక్ష్మారెడ్డి పసుల, ఉండవిల్లి సుజాతామూర్తి, జె.నరసింహారావు, గుర్రాల వేంకటేశ్వర్లు రాసిన కవితలు 2024 ఏప్రిల్ 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Thursday 18 April 2024

పడమటి సూర్యుడు- కవిత


మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదికల సౌజన్యంతో అంబేద్కర్ జయంతి సందర్భంగా 'నేటినిజం' దినపత్రిక  వెలువరించిన 2024 ఏప్రిల్ 18నాటి  ప్రత్యేక సంచికలో ప్రచురితమైన నా కవిత 'పడమటి సూర్యుడు'

అంబేద్కర్ జయంతి సందర్భంగా ‘నేటి నిజం’ దినపత్రిక ప్రత్యేక సంచిక


 మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక

అంబేద్కర్ జయంతి సందర్భంగా 2024 ఏప్రిల్ 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రిక ప్రత్యేక సంచిక వెలువరించింది._

ఇందులో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదికల సౌజన్యంతో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు, శ్రీలతరమేశ్ గోస్కుల, ఎ.రాజ్యశ్రీ, జె.వి.కుమార్ చేపూరి, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, ఎం.వీరకుమారి, గుండం మోహన్ రెడ్డి, మోటూరి నారాయణరావు, జె.నరసింహారావు, చంద్రకళ దీకొండ, గుండవరం కొండల్ రావు, లోడె రాములు, పరిమి వెంకట సత్యమూర్తి, నాగిరెడ్డి అరుణజ్యోతి, అయ్యలసోమయాజుల ప్రసాద్, రజనీ కులకర్ణి తదితరులు రాసిన కవితలు ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

ఏకాంశ కవిత్వం- 178వ వారం- అంశం: చిత్ర కవిత- అంబేద్కర్


 ఏకాంశ కవిత్వం- 178వ వారం- అంశం: చిత్ర కవిత- అంబేద్కర్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా ఆదివారం అందించే చిత్ర కవితలో 1137వ రోజు ‘అంబేద్కర్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, విజయరాఖీ, నారుమంచి వాణీ ప్రభాకరి, డా. దూబగుంట రామకృష్ణ, వడిచర్ల సత్యం, ఎం.వి.ఉమాదేవి, లక్ష్మారెడ్డి  పసుల, మధు జెల్లా, రాజప్ప, కనకయ్య మల్లముల రాసిన కవితలు 2024 ఏప్రిల్ 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

చిత్ర కవిత నిర్వహణ: గోస్కుల శ్రీలతా రమేశ్

Thursday 11 April 2024

ఏం రాయాలి? (ఉగాది సందర్భంగా కవిత)


దర్పణం సాహిత్య వేదిక, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక నిర్వహిస్తోన్న ఏకాంశ కవిత్వ రచనలో భాగంగా 'ఉగాది' అంశంపై నేను రాసిన కవిత 'ఏం రాయాలి?' 2024 ఏప్రిల్ 11వ తేదీ 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. 

Wednesday 10 April 2024

ఏకాంశ కవిత్వం- 177వ వారం- అంశం: ఉగాది

 


ఏకాంశ కవిత్వం- 177వ వారం- అంశం: ఉగాది

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1130వ రోజు ‘ఉగాది’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు, ఏడెల్లి రాములు, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, కనకయ్య మల్లముల, అయ్యల సోమయాజుల ప్రసాద్, జె.నరసింహారావు, చంద్రకళ దీకొండ, గుండవరం కొండల్ రావు, కందుకూరి మనోహర్, పద్మ ఉప్పల రాసిన కవితలు 2024 ఏప్రిల్ 11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 3 April 2024

ఏకాంశ కవిత్వం- 176వ వారం- అంశం: నాట్యం

 


ఏకాంశ కవిత్వం- 176వ వారం- అంశం: నాట్యం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1110వ రోజు ‘నాట్యం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో లక్ష్మారెడ్డి  పసుల, జె.వి.కుమార్ చేపూరి, కె.కె.తాయారు, మోటూరి శాంత కుమారి, రాజప్ప, ఆర్. రమాదేవి, గుర్రాల వేంకటేశ్వర్లు, రజనీ కులకర్ణి, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2024 ఏప్రిల్ 4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 


Wednesday 27 March 2024

ఏకాంశ కవిత్వం- 175వ వారం- అంశం: సమర్థుడు

 


ఏకాంశ కవిత్వం- 175వ వారం- అంశం: 'సమర్థుడు’

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1109వ రోజు 'సమర్థుడు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో గుర్రాల వేంకటేశ్వర్లు, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, రాజప్ప, రజనీ కులకర్ణి, మోటూరి శాంత కుమారి, వి. సంధ్యారాణి రాసిన కవితలు 2024 మార్చి 28వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Friday 22 March 2024

ఉగాది పచ్చడికి రుచిని తెచ్చే లవణం

ఉగాది సందర్భంగా షడ్రుచుల్లో ఒక్కో రుచిపై ఒక్కో రచయిత ఆలోచనామృత ధారలో భాగంగా ఉప్పుపై నేను రాశాను. నాలుగేళ్ల కిందట ఇదే రోజు (2020 మార్చి 25) నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇది ప్రచురితమైంది. ఆ రైటప్ పూర్తి పాఠం ఇది.


ఉగాది పచ్చడికి రుచిని తెచ్చే లవణం
-డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు

“ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు
పప్పు లేని తిండి ఫలము లేదు”
అని యోగి వేమన దాదాపు మూడు శతాబ్దాల కిందే చెప్పాడు. రుచులకు సెల్యూట్ కొట్టే లోకం అనాది నుండే ఉప్పుకు దాసోహమైంది. ఆసేతు హిమాచలమే కాదు- అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజాది రాజ్యాలే కాదు- అమెరికా, ఆఫ్రికాతో సహా ప్రపంచమంతా ఉప్పు విషయంలో ఒక్కతాటిపైకి వస్తాయి. ఏకాభిప్రాయం వెలిబుచ్చుతాయి. కూరే కాదు, ఏ వంటకమైనా ఘుమఘుమలాడాలంటే తగిన మోతాదులో ఉప్పు పడి తీరాల్సిందే. ఉప్పు లేకుండా ఎన్ని పదార్థాలను గుమ్మరించినా, వేర్వేరు సుగంధ ద్రవ్యాలతో అతిథులను ఏమార్చాలని చూసినా వెంటనే దొరికిపోతారు. రుచీ పచీ లేదని అతిథులు కొందరు నిర్మొహమాటంగా చెప్పేస్తారు. మొహమాటం బ్యాచి అతిథుల నొసళ్లు, కళ్లు ఆ వంటకంపై మనోభావాలను వెల్లడిస్తాయి. అతిథులను మెప్పించాలంటే ఉప్పు ఉండాల్సిందే. అందుకే నీతి సూత్రాలను ప్రవచించిన వేమన సైతం కూరలో ఉప్పు ఉండాల్సిందేనన్నాడు.

సోడియం క్లోరైడ్ అనే రసాయన సమ్మేళనాన్ని ఉప్పుగా పేర్కొంటారు. స్ఫటిక రూపంలో ఉండే ఉప్పును ‘రాక్ సాల్ట్’ లేదా ‘హాలైట్’ అంటారు. దీన్ని సముద్ర జలాల నుండి సంగ్రహిస్తారు. ఒక లీటరు సముద్ర జలాల్లో 35 గ్రాముల ఉప్పు ఉంటుందని శాస్త్రవేత్తల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే సముద్రపు నీటిలో మూడున్నర శాతం లవణం ఉంటుందన్నమాట. నీటి నుండి ఉప్పును సంగ్రహించడం క్రీ.పూ.ఆరువేల సంవత్సరాల కాలం నుండే ఉందని శాస్త్రవేత్తలు చెప్తారు. ప్రస్తుత రొమేనియా ప్రాంతంలో ఈ సంగ్రహణ ప్రారంభమైందట. బల్గేరియా లోని సాల్నిట్సాటా నగరంలో క్రీ.పూ.5400 సంవత్సరంలోనే ఉప్పు లభ్యత ఉందని చరిత్రకారులు వెల్లడించారు. ఆ నగరం పేరు ‘సాల్నిట్సాటా’ కు అర్థం ‘ఉప్పు పనులు’. అనంతర కాలంలో హీబ్రూలు, గ్రీకులు, రోమన్లు, బైజాంటైన్లు, భారతీయులు ఈ విధానంలో ఉప్పును సంగ్రహించడం మొదలు పెట్టారు. అన్నట్టు ఉప్పుకూ ఒక నగరముంది. ఆస్ట్రియా లోని శాల్జ్ బర్గ్ నగరాన్ని ‘ది సిటీ ఆఫ్ సాల్ట్’ అని పిలుస్తారు. రోమన్ సామ్రాజ్యంలో సైనికులకు ఉప్పును వేతనంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది. కొన్ని ప్రాంతాల్లో ఉప్పును మారక ద్రవ్యంగా కూడా వాడేవారు.

ఉప్పును పరిశ్రమల్లో విరివిగా వాడుతారు. కాస్టిక్ సోడా తయారీలోనూ క్లోరిన్ ఉత్పత్తి లోనూ ఉప్పును వినియోగిస్తారు. పాలీ వినైల్ క్లోరైడ్, ప్లాస్టిక్, పేపర్ పల్ప్ తదితర పరిశ్రమల్లో ఉప్పు వాడకం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండు వందల మిలియన్ టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతోంది. అయితే ఈ ఉత్పత్తిలో కేవలం ఆరు శాతం ఉప్పును మాత్రమే మనం గృహ అవసరాలకు వాడుతున్నాం. మిగతా ఉప్పును పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తున్నారు.

ఉప్పు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఉప్పును 14 వేల రకాలుగా వాడవచ్చని ‘సాల్ట్ ఇనిస్టిట్యూట్’ అనే సంస్థ పేర్కొంది. దంతాలను మెరిసేలా చేయడం లోను, చిగుళ్లకు రక్షణ కల్పించడంలోను, యాపిల్ మొదలైన కొన్ని పదార్థాలు రంగు మారకుండా చూడడం లోను, వాసనా తొలగించడం లోను, కాలిన గాయాల మంటలను తగ్గించడంలోను ఉప్పు వినియోగం ప్రస్తావించదగింది. క్రిమి నివారణలోనూ ఉప్పు ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లోని క్రిములు నశిస్తాయి. బట్టలను, వస్తువులను శుభ్రం చేసేందుకు కూడా ఉప్పును ఉపయోగిస్తారు. పదార్థాలను నిల్వ ఉంచాలంటే ఉప్పును పట్టించాల్సిందే. ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు వేల సంవత్సరాలుగా ఉప్పును వాడుతున్నారు. ఊరగాయలు, చేపలు, మాంసం మొదలైనవి ఎగుమతిలో, నిల్వలో జాప్యాన్ని తట్టుకునేందుకు ఉప్పు వాడకమే కారణం.

ఆరోగ్యానికి కూడా ఉప్పు ముఖ్యమైంది. ఉప్పే కదా అని అంత ఈజీగా తీసేసే వస్తువేమీ కాదిది. ఉప్పు మనిషిలో తగినంత మోతాదులోనే ఉండాలి. ఈ మోతాదును కూడా ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధారించింది. వయోజనులు రోజూ రెండు వేల మిల్లీ గ్రాముల కంటే తక్కువ మోతాదులో సోడియంను వాడాలని – అంటే ఐదు గ్రాముల ఉప్పును మాత్రమే వాడాలని ఆ సంస్థ నిర్దేశం. అలా ఉంటేనే ఒంట్లో నీటి సమతుల్యతను కాపాడుకోవచ్చు. ఉప్పు తగినంత లేకపోతే మనిషి నీరసించిపోతాడు. అలసటకు లోనవుతాడు. చికాకు పడతాడు. గుండె సరిగ్గా పని చేయలన్నా, మూత్రపిండాలు వాటి డ్యూటీ అవి చేయలన్నా శరీరానికి తగినంత మోతాదులో ఉప్పును అందించాల్సిందే. అది తగ్గితే ఎంత ప్రమాదమో ఎక్కువైతే అంతే డేంజరు. అధికశాతంలో ఉప్పు వినియోగం కార్డియో వాస్క్యులార్ వ్యాధులకు దారి తీస్తుంది. రక్తపోటు పెరిగిపోతుంది. బ్లడ్డు ప్రెషరు ఎక్కువైన మనిషి ఆవేశపడుతున్నాడంటే అది ఆయన తప్పు కాదని, ఆయన శరీరం లోని ఉప్పే ఆయనను నిప్పులా మార్చేస్తోందని అర్థం చేసుకోవాలి.

ప్రధానంగా ఎలక్ట్రోలైటుగా ఉప్పును వినియోగిస్తారు. అయోడిన్ కొరతను నివారించేందుకు పొటాషియం అయోడైడ్ ఉండే అయోడైజ్డ్ ఉప్పు వాడాలని పోషకాహార నిపుణులు సూచిస్తారు. ఎండ తీవ్రత అధికమైన పరిస్థితుల్లో కొంచెం మజ్జిగలో ఉప్పు వేసి తాగిస్తే వెంటనే కోలుకుంటారు. కాళ్లు, మోకాళ్లు నొప్పిగా ఉన్న సందర్భాల్లో నీటిలో ఉప్పును వేసి, ఆ నీటిలో కాళ్లు ఉంచడం వల్ల నొప్పి మటుమాయమవుతుందని గృహవైద్య చిట్కా చెబుతుంది. గొంతులో గరగరకు, ఎడతెరిపి లేని దగ్గుకు దివ్యౌషధం ఉప్పు నీరు. విషాహారానికి విరుగుడుగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ‘మీ టూత్ పేస్టులో ఉప్పు ఉందా?’ అని ప్రశ్నించే ప్రకటన టూత్ పేస్టులో ఉప్పు వినియోగం మంచిదని సూచిస్తుంది. శరీరంపై గాయాలకు ఉప్పు నీటితో కడగడం ఉత్తమమంటారు. ఉప్పు నీటితో ముఖాన్ని కడగడం వల్ల మృత కణాలు పోయి, ముఖం కాంతివంతమవుతుంది. శరీరంలో జీర్ణ క్రియతో సహా రసాయన ప్రక్రియలు సజావుగా జరగాలంటే ఉప్పు ఉండాల్సిందే.

మనుషులకే కాకుండా చెట్లకు కూడా ఉప్పు ఎంతో ఉపయోగకారి. కొబ్బరి చెట్టుకు వచ్చే మువ్వ తెగులుకు ఉప్పు వాడకం ఉత్తమం. వంగ, మొక్క జొన్న లాంటి పంటలకు సోడియం క్లోరైడ్ ను ఎరువుగా వాడతారు. వివిధ రకాల వనమూలికలతో చేసిన ఉప్పు చెక్క అవులకు, గొర్రెలకు చక్కటి ఔషధం.

ఆ మధ్య వచ్చిన ఒక హాస్యభరిత చిత్రంలో ఒక పాత్ర ‘మీ సాల్టూ సాంబారూ తిన్నవాడిని’ అంటుంది. అదీ ఉప్పు ఘనత. ఎవరైనా ‘మీ తిండి తిన్నవాడిని’ అనరు. నిజానికి అలా అంటే ‘మొదటి వ్యక్తి తినాల్సిన తిండి’ అనే అర్థం ధ్వనిస్తుంది తప్ప సరైన అర్థాన్ని ఆ వాక్యం సూచించదు. ‘ఫలానా వాళ్ల ఉప్పు తిన్నవాణ్ణి’ అని చెప్పుకోవడమే ఎక్కడైనా కనబడుతుంది. కృతజ్ఞతకు పతాక స్థాయి అది. ఉప్పును అప్పుగా ఇవ్వకూడదనే నియమం కూడా ఉంది. ఉప్పును చేతికి ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదంటారు పెద్దలు. ‘ఉప్పందించడం’ అంటే అర్థం రహస్యాన్ని అందజేశారనే. ‘ఫలానా సంఘ వ్యతిరేక శక్తుల కదలికలపై ఉప్పందుకున్న పోలీసులు..’ లాంటి వాక్యాలను అక్కడక్కడా చూడవచ్చు. ఉప్పంటే రహస్య సమాచారం కూడా.
ఉప్పుకు నిరుపేద, కోటీశ్వరుడనే తేడా లేదు. ఎవరైనా ఉప్పుకుండే సొగసైన రుచికి దాసోహమవ్వాల్సిందే. అందుకే నరసింహ శతక కర్త శేషప్ప కవి ‘లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మ్రింగబోడ’ని ఘంటాపథంగా చెప్పాడు.

ఉప్పును లక్ష్మీరూపంగా భావిస్తారు. కొందరు ఉప్పుతో దీపాన్ని వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వారి నమ్మకం. దిష్టి దోషాల పరిహారం కోసం ఉప్పుతో దిష్టి తీయడం మనకందరికీ తెలిసిందే. ఎన్నో తంత్రాల్లో ఉప్పు ఉపయోగం మంచి ఫలితాలనిస్తుందని కొందరి విశ్వాసం.

జాతీయోద్యమంలో నిప్పు రాజెయ్యడంలోనూ ఉప్పుదే ప్రధానపాత్ర. ఉప్పుపై అధికపన్నుకు నిరసనగా మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం స్వాత్రంత్ర్య కాంక్షను ప్రజల్లో రగిల్చి, దేశ స్వాతంత్ర్యానికి దారి తీసింది.

ఉగాది పచ్చడిలోనూ ఉప్పు అత్యంత కీలకమైంది. ఉప్పు ఎప్పుడూ ‘అన్నేసి చూడు – నన్నేసి చూడు’ అంటుంది. షడ్రుచుల్లో మధురామ్ల కటు తిక్త కషాయాలన్నీ (తీపి, పులుపు, కారం, చేదు, వగరు) ఒక ఎత్తు. లవణం ఒక్కటీ ఒక ఎత్తు. ఉగాది పచ్చడికి ఆ రుచిని తేవడంలో ఉప్పు పాత్రం ప్రధానమైంది.

కొందరు ఎంత ఉత్తమమైన పని చేసినా మంచి పేరు రాదు. కొన్ని సందర్భాల్లో కనీసం వారి పేరును ఉచ్చరించడానికి కూడా జనం ఇష్టపడరు. కూరలో కరివేపాకులా ఫైనల్ ప్రోడక్టులో ఉప్పును తీసివేయలేం. అయినా ఉప్పు జాతకం కూడా అంతే. పూర్వకాలం ఉప్పును ఆ పేరుతో ఉచ్చరించరాదని నిబంధనలు కూడా ఉండేవి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉప్పును మరోపేరుతో పేర్కొనాలని పెద్దలు చెప్పేవారు. ఇన్నిరకాలుగా ఉపయోగపడుతున్న ఉప్పును ఉచ్చరించడమే పాపమయ్యేది. పాపం ఉప్పు!

Wednesday 20 March 2024

ఏకాంశ కవిత్వం- 174వ వారం- అంశం: సెలవు రోజు


 

ఏకాంశ కవిత్వం- 174వ వారం- అంశం: సెలవు రోజు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1107వ రోజు ‘సెలవు రోజు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు, రాజప్ప, నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ, వి. సంధ్యారాణి, ఆర్. రమాదేవి, మోటూరి శాంతకుమారి, లక్ష్మారెడ్డి  పసుల, జాలిగామ నరసింహారావు, కె.కె.తాయారు రాసిన కవితలు 2024 మార్చి 21వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 13 March 2024

ఏకాంశ కవిత్వం- 173వ వారం- అంశం: ‘ముఖపుస్తకం కాసేపు ముఖం చాటేస్తే?!’


ఏకాంశ కవిత్వం- 173వ వారం- అంశం: ‘ముఖపుస్తకం కాసేపు ముఖం చాటేస్తే?!’

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1105వ రోజు ‘ముఖపుస్తకం కాసేపు ముఖం చాటేస్తే?!’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, రాజప్ప, మోటూరి శాంతకుమారి, అరుణ కోదాటి, జె.వి.కుమార్ చేపూరి, జక్కని గంగాధర్, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2024 మార్చి 14వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                


Wednesday 6 March 2024

చక్రభ్రమణం (మహిళా దినోత్సవం సందర్భంగా కవిత)


మహిళా దినోత్సవం సందర్భంగా నేను రాసిన కవిత 'చక్రభ్రమణం' 2024 మార్చి 7 వ తేదీ 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం (2024005). 
-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

వ్యవస్థ అవలక్షణాలపై చైతన్యపరిచే రాంకిషన్ పాటలు (వ్యాసం)


గొల్లపెల్లి రాంకిషన్ గారు రాసిన 'స్పృహ' పాటల సంపుటిపై నేను రాసిన 'వ్యవస్థ అవలక్షణాలపై చైతన్యపరిచే రాంకిషన్ పాటలు' వ్యాసం 2024 మార్చి 7 వ తేదీ 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. 

-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

ఏకాంశ కవిత్వం- 172వ వారం- అంశం: వర్కింగ్ ఉమన్




ఏకాంశ కవిత్వం- 172వ వారం- అంశం: వర్కింగ్ ఉమన్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1101వ రోజు ‘వర్కింగ్ ఉమన్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, శ్రీలతరమేశ్ గోస్కుల, గుర్రాల వేంకటేశ్వర్లు, మోటూరి శాంతకుమారి, రజనీ కులకర్ణి, చంద్రకళ దీకొండ, నగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి పసుల, అయ్యలసోమయాజుల ప్రసాద్, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2024 మార్చి 7వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Thursday 29 February 2024

ఏకాంశ కవిత్వం- 171వ వారం- అంశం: విహారయాత్ర


 ఏకాంశ కవిత్వం- 171వ వారం- అంశం: విహారయాత్ర

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1090వ రోజు ‘విహారయాత్ర’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, వి.సంధ్యారాణి, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, నారుమంచి వాణీ ప్రభాకరి, మధు జెల్లా, డా. కాసర్ల రంగారావు, మోటూరి శాంతకుమారి, అరుణ కోదాటి రాసిన కవితలు 2024 ఫిబ్రవరి 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                               

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 21 February 2024

ఏకాంశ కవిత్వం- 170వ వారం- అంశం: నెట్టు లేనట్టయితే నెట్టుకొచ్చేదెలా?!


 ఏకాంశ కవిత్వం- 170వ వారం- అంశం: నెట్టు లేనట్టయితే నెట్టుకొచ్చేదెలా?!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1080వ రోజు ‘నెట్టు లేనట్టయితే నెట్టుకొచ్చేదెలా?!’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, మధు జెల్లా, నారుమంచి వాణీ ప్రభాకరి, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి,  మన్నెలలిత, కె.కె.తాయారు, లక్ష్మారెడ్డి  పసుల, జక్కని గంగాధర్, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 ఫిబ్రవరి 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                               

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Tuesday 20 February 2024

అక్షర గ్రూపు- మినీ కథల పోటీ

 అక్షరం గ్రూప్ నిర్వహించే మినీ కథల పోటీ

🪷🪷🪷🪷🪷🪷🪷

మహిళా దినోత్సవం-2024

సందర్భంగా *మహిళా ప్రాధాన్యత*గా మినీ కథల పోటీ నిర్వహిస్తున్నాము.కధ ఒక పేజీ కన్నా మించరాదు. మీకధ ఈ పోటీ కోసం మాత్రమే రాసినది అని హామీపత్రంలో రాయాలి. మీరు అక్షర సమూహంలో సభ్యులయి ఉండాలి👍

మేము కథల పోటీలు కవితల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే వున్నాము. వారానికి కనీసం 1,2 పోస్టులు గ్రూప్ లో పెట్టని వారు కూడా పోటీలలో మాత్రం పాల్గొంటున్నారు.మన గ్రూపులో 150 కి పైన సభ్యులు వున్నారు.60కి పైగా మహిళా సభ్యులు వున్నారు. కానీ రోజుకు ఎంతమంది గ్రూపులో పోస్ట్ లు పెడుతున్నారు? రెగ్యులర్  గా పాల్గొంటూ, ఇతరులు రాసిన రచన లపై స్పందించే వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులు. మరల ఈ పోటీలు ఉగాది కి కూడా ఉంటాయి. ప్రస్తుతం *మహిళా సభ్యులుకు* మాత్రమే ఈ పోటీ.

నిబంధనలను అనుసరించి రాసిన కధలను, అర్హత పొందిన కధలను మాత్రమే పోటీకి తీసుకుంటాము. పోటీలో పాల్గొనే వారు తమ కధలను ఫిభ్రవరి 29 రాత్రి వరకు పంపవచ్చు. ఆ తర్వాత వచ్చిన కధలు స్వీకరించబడవు. ఈ కధలకి శ్రీమతి బాల భారతి గారు తమ అమ్మానాన్నలు పద్మ కేశవ అవార్డుపేరు మీద  నగదు బహుమతులను అందిస్తున్నారు..

ప్రధమ బహుమతి..1000

రూ

ద్వితీయ బహుమతి..800రూ

తృతీయ బహుమతి..600రూ

ప్రోత్సహాక బహుమతి.. 200రూ (ముగ్గురికి)

కధలు పంపడానికి త్వరలోనే లింక్ పంపుతాను. అప్పుడే పోస్ట్ చెయ్యండి. 🪷

డా.పాతూరి అన్నపూర్ణ.. గ్రూప్ వ్యవస్థాపక

అధ్యక్షురాలు 🪷

Wednesday 14 February 2024

ఏకాంశ కవిత్వం- 169వ వారం- అంశం: పుస్తకాల పండుగ

 


ఏకాంశ కవిత్వం- 169వ వారం- అంశం: పుస్తకాల పండుగ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా
1083వ రోజు ‘పుస్తకాల పండుగ’
అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, మోటూరి శాంతకుమారి, నగునూరి రాజన్న, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, ఎ.రాజ్యశ్రీ, మధు జెల్లా, ఆర్.రమాదేవి రాసిన కవితలు 2024 ఫిబ్రవరి 15వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                               

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 7 February 2024

ఏకాంశ కవిత్వం- 168 వ వారం- అంశం: మనసు భాష


ఏకాంశ కవిత్వం- 168 వ వారం- అంశం: మనసు భాష

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1058వ రోజు ‘మనసు భాష’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జె.వి.కుమార్ చేపూరి, చంద్రకళ దీకొండ, వి. సంధ్యారాణి, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2024 ఫిబ్రవరి 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                               

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 31 January 2024

ఏకాంశ కవిత్వం- 167వ వారం- అంశం: నిద్ర

 ఏకాంశ కవిత్వం- 167వ వారం- అంశం: నిద్ర

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1054వ రోజు ‘నిద్ర’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, నగునూరి రాజన్న, కృష్ణవేణి పరాంకుశం, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, శ్రీలతరమేశ్ గోస్కుల, మోటూరి శాంతకుమారి, జె.నరసింహారావు, పరిమి వెంకట సత్యమూర్తి,  గుండం మోహన్  రెడ్డి రాసిన కవితలు 2024 ఫిబ్రవరి 1వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                           

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 24 January 2024

ఏకాంశ కవిత్వం- 166వ వారం- అంశం: కాకి


ఏకాంశ కవిత్వం- 166వ వారం- అంశం: కాకి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1051వ రోజు ‘కాకి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో కందుకూరి మనోహర్, జె.వి.కుమార్ చేపూరి, నారుమంచి వాణీ ప్రభాకరి, మోటూరి శాంతకుమారి, కనకయ్య మల్లముల, జె.నరసింహారావు, రజని కులకర్ణి, మన్నె లలిత, జక్కని గంగాధర్, గుండం మోహన్ రెడ్డి రాసిన కవితలు 2024 జనవరి 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

Wednesday 17 January 2024

ఏకాంశ కవిత్వం- 165వ వారం- అంశం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్


ఏకాంశ కవిత్వం- 165వ వారం- అంశం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1048వ రోజు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి, జె.నరసింహారావు, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, మోటూరి శాంతకుమారి, గుండవరం కొండల్ రావు, జక్కని గంగాధర్, నగునూరి రాజన్న, అరుణ కోదాటి  రాసిన కవితలు 2024 జనవరి 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                                

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839  

Wednesday 10 January 2024

సామాజికాంశాలతో 'భావదర్పణం'

దర్పణం సాహిత్య వేదిక అధ్యక్షులు డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు సంపాదకత్వంలో వెలువడ్డ 'భావదర్పణం' కవితా సంకలనంపై ప్రముఖ కవి, రచయిత దాస్యం సేనాధిపతి గారు రాసిన వ్యాసం 2024 జనవరి 11వ తేదీ 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. 

ఏకాంశ కవిత్వం- 164వ వారం- అంశం: లెక్కలు

ఏకాంశ కవిత్వం- 164వ వారం- అంశం: లెక్కలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1041వ రోజు ‘లెక్కలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జె.వి.కుమార్ చేపూరి, మోటూరి శాంతకుమారి, జె.నరసింహారావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, మన్నె లలిత, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, జక్కని గంగాధర్, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, నారుమంచి వాణీ ప్రభాకరి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2024 జనవరి 11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                                        -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

 

Wednesday 3 January 2024

ఏకాంశ కవిత్వం- 163వ వారం- అంశం: కొత్త సంవత్సరం

 


ఏకాంశ కవిత్వం- 163వ వారం- అంశం: కొత్త సంవత్సరం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1044వ రోజు ‘కొత్త సంవత్సరం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి,  ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, కనకయ్య మల్లముల, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, మన్నెలలిత, గుర్రాల వేంకటేశ్వర్లు, నగునూరి రాజన్న, సంగెవేని రవీంద్ర, జె.నరసింహారావు రాసిన కవితలు 2024 జనవరి 4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839