Friday, 12 June 2020

'ఇద్దరూ ఇద్దరే- శిఖర సమానులే' వ్యాసం


ఇద్దరూ ఇద్దరే- శిఖర సమానులే

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ ఆచార్య సి.నారాయణరెడ్డి జయంతి వేడుకల్లో  
కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు ఆచార్య చంద్రశేఖర కంబార గారు 
'విశ్వంభర' పురస్కారం పొందే సందర్భంగా 
నేను రాసిన ఈ వ్యాసం 'ఇద్దరూ ఇద్దరే- శిఖర సమానులే' 
2019 జూలై 29 వ తేదీ 'మన తెలంగాణ' దినపత్రికలో ప్రచురితమైంది. 

Thursday, 11 June 2020

బేతాళుడి నిరీక్షణ- కవిత


ఏషియా నెట్ న్యూస్ వెబ్ పత్రికలో ప్రచురితమైన 'బేతాళుడి నిరీక్షణ' కవిత 

Monday, 8 June 2020

వేదాలను ఔపోసన పట్టిన మార్క్సిస్టు (దాశరథి రంగాచార్య గారిపై వ్యాసం)


సుప్రసిద్ధ రచయిత దాశరథి రంగాచార్య గారి వర్ధంతి ఈరోజు. 
రెండేళ్ల క్రితం ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసమిది
 ('నేటి నిజం' దినపత్రిక, 07.06.2018)

అలుపెరుగని సైనికులు (పాట)



































కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నేను రాసిన పాట
2020 జూన్ 8 'మనం' దినపత్రికలో ప్రచురితం 


అలుపెరుగని సైనికులు
     ---- డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు
           9441046839

పోలీసులు వారు... ఔను
జనం ప్రాణ రక్షకులు
జగము లోన హీరోలు
అలుపెరుగని సైనికులు

రోడ్ల పైన యుద్ధమే
గల్లీల్లో యుద్ధమే
ఎటు చూస్తే అటు యుద్ధం
సమరానికి మరి సిద్ధం

కనిపించని శత్రువుతో
క్షణక్షణం పోరాటం
జనం ఊపిరి నిలవాలని
అనుక్షణం ఆరాటం

పిల్లలేదు- ఇల్లు లేదు
కుటుంబాన్ని మరచినారు
రేయింబవళ్లు వారు
కదనంలో నిలిచారు

తన శ్వాసను అడ్డుపెట్టి
జనం కొరకు పోరాటం
తన చింతను వదిలిపెట్టె
జనమె తనకు ముఖ్యమాయె

కోడి కింద దాచినట్టు
కోతి పొదివి పెట్టినట్టు
జనం గూడు చుట్టూరా
విహంగంగ మారినారు

అంబులెన్సు వెనుక తానె
ఆసుపత్రిలోన తానె
రోడ్డుపైన పోలీసే
అంగడిలో ఆ సారే

ఎటు చూస్తే అటు వారే
ప్రజల ప్రాణ రక్షకులు
ఖాకీ బట్టల్లో వారు
కూరిమితో నిలిచినారు

ఇళ్లలోనె గడపాలి
రోడ్లపైకి రావద్దు
చేతులను తుడవాలి
మూతులను కప్పాలి

దగ్గరగా ఉండొద్దు
ముక్కు, మూతి తాకొద్దు
పోలీసుల మాట
మనకు చద్దన్నం మూట


Tuesday, 2 June 2020

ప్రయోగశాల కరదీపిక తయారీ నుండి ప్రయోగ నిర్వహణ దాకా...


Why should women have all the fun?
లాక్ డౌన్ ఘుమఘుమలు -2
ప్రయోగశాల కరదీపిక తయారీ నుండి ప్రయోగ నిర్వహణ దాకా...

జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో దక్షిణ భారత దేశ స్థాయి ప్రయోగశాల కరదీపిక రూపకల్పన కోసం కార్యశాలను ఆ మధ్య నిర్వహించింది. మైసూరులోని ప్రాంతీయ విద్యా కళాశాల లో ఆ కార్యశాల జరిగింది. వెళ్ళింది ప్రయోగశాల కరదీపిక తయారీ కోసం.. ప్రయోగాలు చేయకుండా ఊర్కోలేం.. పైగా తిరిగే కాలు, తినే నోరు కుదురుగా ఉండవంటారు గదా!  మైసూరులో చాముండి హిల్స్ కు వెళ్ళాం. చాముండేశ్వరి దేవాలయం చూశాం. మహారాజా ప్యాలెస్ లో వడయార్ల వైభోగాన్ని అనుభూతి చెందాం. బృందావన్ గార్డెన్స్ లో విహరించాం. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ కు వెళ్ళాం. తెలుగేతర ప్రాంతాల విద్యార్థులు అక్కడ తెలుగు అభ్యసించే తీరుకు ముగ్ధులమయ్యాం.

అలా సాయంత్రాలు మైసూరు నగరంలో జరిపిన పర్యటనల్లో ఒకరోజు బస్సులో నుండి దృశ్యాలను చూస్తూ మైమరిచి పోయాం. చాలా దూరం వెళ్ళాక కండక్టర్ ను అడిగితే తెలిసిన విషయం ఏంటంటే మేం దిగాల్సిన స్టేజి దాటి చాలా సేపయిందని. అక్కడే బస్సు ఆపించుకుని, దిగి, పదకొండో నెంబరు బస్సును (అంటే కాలుకు బహువచనం అని శరీర నిర్మాణ శాస్త్రం చెప్తోంది) ఆశ్రయించి, రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు వచ్చి పడ్డాం.

ఆ రోజుల్లోనే మైసూరు పేరు మీదుగా ఉండే పాకం గానీ, బజ్జీ గానీ రుచి చూడాలని మా మనసులు కోరుకున్నాయి. అలా మనసు నుండి ఆదేశాలు నాలుకకు వెళ్ళాయి. నాలుక ప్రేరేపించడంతో కొన్ని జతల కాళ్ళు మహారాజా ప్యాలెస్ దగ్గర ఒక హోటల్ వైపు దారితీశాయి. 'ఏమున్నాయి?' అని అడగడం ఆలస్యం అక్కడి సర్వర్ ఇచ్చిన జవాబు శతాబ్ది ఎక్స్ ప్రెస్ ను గుర్తుకు తెచ్చింది. ఫుల్ స్టాపులు, కామాలు లేకుండా అతనిచ్చిన సమాధానంలో ఒక్క ఐటం కూడా అర్థం కాలేదు. మళ్ళీ అడిగితే మళ్ళీ అదే వేగం. ఈసారి కాస్త జాగ్రత్తగా విన్నాం. కానీ ఏ ఒక్క ఐటం లోనూ మైసూర్ అనే పేరున్నట్టు వినబడలేదు. అందుకే ఇలా లాభం లేదని తీర్మానించుకుని నేరుగా అడిగేయడం ఉత్తమమని డిసైడ్ అయిపోయాం. 'మైసూర్ బజ్జీ ఉందా?' అని మా ప్రశ్న. 'ఈ మాత్రం దానికి అప్పుడే అడిగేయవచ్చు కదా' అని అతడి చూపుకు మనో విజ్ఞానశాస్త్రం ఇచ్చిన సొల్యూషన్. తన మనసు బయటపడకుండా వీలైనంత మర్యాదగా లేదని జవాబిచ్చాడు. అప్పటికే రెండుసార్లు ఏమున్నాయని అడిగేశాం. మరోసారి అడగడం పద్ధతి కాదని ఆగిపోయాం. ఈ సారి మరో రూట్ లో వచ్చి 'ఈ హోటల్ లో తయారు చేసే స్పెషల్ టిఫిన్స్ ఏంటి?' అని అడిగాం. అప్పుడతను ఇచ్చిన జవాబు 'మల్లిగె ఇడ్లీ' అని. ఆ సమాధానం నాకు ఇంకా బాగా గుర్తుంది. అతను కాసేపటికి వేడివేడిగా ఇచ్చిన ఇడ్లీ రుచి అంతకంటే బాగా మెదడు లోపలి పొరల్లో నిక్షిప్తమైంది. 'మల్లిగె' అంటే మల్లె పువ్వని తెలిసింది. మల్లెపువ్వులా చాలా మృదువుగా ఉన్న ఆ ఇడ్లీ మైసూరు పేరు వినగానే నాకు గుర్తొచ్చే జ్ఞాపకాల్లో ఒకటి.

ఎండాకాలం అంటే మండేకాలమే కాదు, మల్లెల కాలం కూడా. అందుకే ఈ లాక్ డౌన్ కాలంలో మే నెల చివరి రోజు 'మల్లిగె ఇడ్లీ' గుర్తొచ్చింది. మరోసారి ఆ రుచిని ఆస్వాదించాలనిపించింది. మరో సందర్భం అయితే అలా అనిపించినపుడు కాలికి పని చెప్తాం. కానీ లాక్ డౌన్ వల్ల ఈ సారి చేతికి పని చెప్పాను. గూగుల్ తల్లిని మనసులో ధ్యానించి, కరుణా కటాక్ష వీక్షణాలు కురిపించమని యూ ట్యూబ్ ను వేడుకుంటే 'మల్లిగె ఇడ్లీ' చేసే విధానం చూడగలిగాను. ఇంకేం..  కావలసినవన్నీ సిద్ధం చేసుకుని, తెలంగాణ అవతరణకు ముందు రోజు ... అంటే నిన్న .. ఒక పట్టు పట్టాను. మీరూ ఒకసారి టేస్ట్ చేయండి.

కావలసిన పదార్థాలు:
(15 ఇడ్లీల తయారీ కోసం)
1. మినపపప్పు- ఒక కప్పు 2. అటుకులు- 1 కప్పు 3. ఇడ్లీ తయారీకి వాడే బియ్యం- రెండు కప్పులు. 4. తగినంత ఉప్పు.

తయారు చేసే పద్ధతి:
1. ఒక కప్పు మినప పప్పు, ఒక కప్పు అటుకులు ఒక గిన్నెలో నాలుగు గంటలపాటు నానబెట్టాలి. 2. మరో గిన్నెలో రెండు కప్పుల ఇడ్లీ బియ్యం నాలుగు గంటలపాటు నానబెట్టాలి. 3. నాలుగు గంటల తర్వాత ఈ రెండింటిని వేర్వేరుగా రుబ్బుకోవాలి. మినపపప్పు- అటుకుల మిశ్రమాన్ని మెత్తగా రుబ్బాలి. బియ్యాన్ని మాత్రం మరీ మెత్తగా రుబ్బకూడదు. 4. ఈ రెండింటినీ కలిపి, పది గంటలపాటు పులియబెట్టాలి. 5. ఇడ్లీ తయారు చేసేముందు ఈ మిశ్రమానికి ఉప్పు కలపాలి. 6. ఇడ్లీ పాత్రలకు కొద్దిగా నూనె రాసి, ఈ పిండి వేయాలి. 7. అలా 12 నిముషాల సేపు ఇడ్లీ కుక్కర్ లో ఆవిరిపై ఉడికించాలి.
8. ఇంకా చెప్పేదేముంది.. చెప్పకున్నా తినొచ్చు.

Friday, 29 May 2020

'వలస దుఃఖం' పాట- డా.బి.కేశవరెడ్డి రచన


'వలస దుఃఖం' పాట
రచన: డా.బి.కేశవరెడ్డి, విశ్రాంత వైద్యులు, గాంధీ వైద్యశాల
ఎడిటింగ్: డా.రాయారావు సూర్య ప్రకాశ్ రావు, ప్రముఖ కవి, రచయిత
గాయకుడు: రాజా
నిర్మాణ పర్యవేక్షణ: డా.ఆర్.రమేష్, వైద్యులు, ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వైద్యశాల, హైదరాబాద్
A song by Dr.B.Keshavareddy, Retired Doctor, Gandhi Hospital
Edited by Dr.R.Surya Prakash Rao, Poet & Writer
Singer: Raja
Supervision: Dr.R.Ramesh, Govt.E.N.T. Hospital, Hyderabad

https://youtu.be/Yikeua_-11Q

Thursday, 28 May 2020

'సైబర్ సేఫ్టీ & సెక్యూరిటీ' తొలిరోజు వెబినార్





'సైబర్ సేఫ్టీ & సెక్యూరిటీ' అనే అంశంపై సి-డాక్ సంస్థ సహకారంతో తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్వహించిన వెబినార్ పరంపరలో తొలిరోజు (2020 మే 27) శిక్షణ చూసేందుకు కింది లింక్ క్లిక్ చేయండి. 
Telangana State Council Of Educational Research & Training is conducting series of webinars on 'Cyber Safety & Security'. This link takes you to the first day of the series. 

Click here to watch the first day webinar on 'Cyber Safety & Security'