Wednesday, 23 September 2026

ఏకాంశ కవిత్వం-301వ వారం- అంశం: కన్యాదానం


ఏకాంశ కవిత్వం-301వ వారం- అంశం: కన్యాదానం                                                    

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1886వ రోజు ‘కన్యాదానం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. చీదెళ్ల సీతాలక్ష్మి, ఎ.రాజ్యశ్రీ, వి.సంధ్యారాణి, రాజప్ప, కోలా సత్యనారాయణ  రాసిన కవితలు 2026 సెప్టెంబరు 24వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839   

No comments:

Post a Comment