ఏకాంశ కవిత్వం-256వ వారం- అంశం: సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1596వ రోజు ‘సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, ఏడెల్లి రాములు, జె.నరసింహారావు, ముద్దు వెంకటలక్ష్మి, శేషారావు వైద్య, లక్ష్మారెడ్డి పసుల, డా.షహనాజ్ బతుల్, కోలా సత్యనారాయణ, రాజప్ప రాసిన కవితలు 2025 అక్టోబరు 30వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839



