Sunday, 18 March 2018

ఏం రాయాలి? (కవిత)


ఏం రాయాలి?
.. డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు

ఉగాదీ!
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?
ఎందరో కవుల
కవిత్వ వస్తువువు
నువ్వు
ఎన్నో కవి
సమ్మేళనాలకు
ప్రేరేపణ నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

వణుకుల కాలానికీ
కమిలిన కాలానికీ
సంధి గీతవు
నువ్వు
రెండు కాలాల మధ్య
సన్నటి వంతెనవు
నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

వణుకుల జీవితాలకూ
కమిలిన బతుకులకూ
ఆశాదీపంగా నిలబడే
పర్వానివి నువ్వు
వణికే జీవితాలకు
వెచ్చటి దుప్పటివో
కమిలిన బతుకులకు
మందు పూతవో
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

రాజపూజ్యాలు ఎన్నో
అవమానాలు ఎన్నో
చిట్టా విప్పే
భవిష్యవాణివి నువ్వు
ఆదాయ వ్యయాలకు
తరాజు పట్టే
ఆర్తికవేత్తవు నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?


లక్షల జతల చెవులకు
కేరాఫ్ అడ్రస్ నువ్వు
ఏడాది పయనానికి
తొలి అడుగు నువ్వు
అయితే మాత్రం...
నీపై కొత్తగా
కవిత్వం ఏం రాయాలి?

ఉగాదీ!
నీపై కొత్తగా కవిత్వం ఏం రాయాలి?


Thursday, 15 March 2018

మృత్యువును జయించిన అద్భుత శాస్త్రవేత్త

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణించిన సందర్భంగా ఆయనపై నేను రాసిన వ్యాసం 2018 మార్చి 15 'మన తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం. 

Wednesday, 21 February 2018

మరణిస్తున్న భాషలు (మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)






































ఈరోజు (ఫిబ్రవరి 21) అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఎడిషన్ల ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా వ్యాసం.

Tuesday, 13 February 2018

సాధికారిక చారిత్రక పరిశోధనా పాత్రికేయులు (జి.వెంకట రామారావు గారిపై ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారి వ్యాసం)

చరిత్ర పరిశోధకులు వెంకట రామారావు గారిపై 
ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారు రాసిన వ్యాసం 
2018 ఫిబ్రవరి 12వ తేదీ 'ఆంధ్ర భూమి' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం. 

Sunday, 11 February 2018

అమ్మంగి రచనలు అయస్కాంతాలు


ప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు డా.అమ్మంగి వేణుగోపాల్ గారి సాహిత్య స్వర్ణోత్సవం, సప్తతి సందర్భంగా 'పాలపిట్ట' మాసపత్రిక ప్రత్యేక సంచిక వెలువరించింది. ఆ సంచికలో ప్రచురితమైన నా వ్యాసం.






Monday, 5 February 2018

మన వెలుగు దివ్వె















 ఫిబ్రవరి 5న తెలంగాణ వైతాళికులు వట్టికోట ఆళ్వార్ స్వామి వర్ధంతి. 
ఈ సందర్భంగా 2018 ఫిబ్రవరి 5వ తేదీన నమస్తే తెలంగాణ దినపత్రిక సాహిత్య అనుబంధం 'చెలిమె'లో ప్రచురితమైన నా వ్యాసం. 

Thursday, 1 February 2018

బడ్జెట్ పై గంపెడాశలు


'ఆంధ్ర జ్యోతి' దినపత్రిక 2018 ఫిబ్రవరి 1- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు ఎడిషన్ల ఎడిట్ పేజీలో ప్రచురితం