Wednesday, 1 April 2026

ఏకాంశ కవిత్వం - 276వ వారం- అంశం: సంఘటిత శక్తి


 ఏకాంశ కవిత్వం-276వ వారం- అంశం: సంఘటిత శక్తి                        

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1730వ రోజు ‘సంఘటిత శక్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ల సీతాలక్ష్మి, పొన్నాల ధనమ్మ, ముద్దు వెంకటలక్ష్మి, పి.పద్మావతి, వి. సంధ్యారాణి, చంద్రకళ దీకొండ, నాగరాజు చుండూరి  రాసిన కవితలు 2026 ఏప్రిల్ 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.   

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839