Wednesday, 28 August 2024

ఏకాంశ కవిత్వం- 197వ వారం- అంశం: ఉదయం

ఏకాంశ కవిత్వం- 197వ వారం- అంశం: ఉదయం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1236వ రోజు ‘ఉదయం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో కందుకూరి మనోహర్, నగునూరి రాజన్న, కె.కె.తాయారు, ఆర్. రమాదేవి, పద్మావతి ‌పి., గుర్రాల వేంకటేశ్వర్లు, కపిలవాయి అశోక్ బాబు

రాసిన కవితలు 2024 ఆగస్టు 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 21 August 2024

ఏకాంశ కవిత్వం- 196వ వారం- అంశం: మా ఊరి బస్సు

ఏకాంశ కవిత్వం- 196వ వారం- అంశం: మా ఊరి బస్సు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1217వ రోజు ‘మా ఊరి బస్సు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఎం.వి.ఉమాదేవి, ఎ.రాజ్యశ్రీ, నగునూరి రాజన్న, విజయలక్ష్మి వడ్డేపల్లి, మోటూరి శాంతకుమారి, ఎం. వీరకుమారి, పి. పద్మావతి, లక్ష్మారెడ్డి పసుల, రాజప్ప, గుండం మోహన్ రెడ్డి రాసిన కవితలు 2024 ఆగస్టు 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Thursday, 15 August 2024

ఏకాంశ కవిత్వం- 195వ వారం- అంశం: కవి గారి ఇల్లు

ఏకాంశ కవిత్వం- 195వ వారం- అంశం: కవి గారి ఇల్లు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1228వ రోజు ‘కవి గారి ఇల్లు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, జె.నరసింహారావు, కె.కె.తాయారు, రామకృష్ణ చంద్రమౌళి, ఆర్. ప్రవీణ్, రాజప్ప, గుండం మోహన్ రెడ్డి, అరుణ కోదాటి, ఎం.వి.ఉమాదేవి, పి.పద్మావతి, రజనీకులకర్ణి రాసిన కవితలు 2024 ఆగస్టు 15వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 7 August 2024

ఏకాంశ కవిత్వం- 194వ వారం- అంశం: ప్రణయనగరిలో ప్రపంచ క్రీడలు

ఏకాంశ కవిత్వం- 194వ వారం- అంశం: ప్రణయనగరిలో ప్రపంచ క్రీడలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1225వ రోజు ‘ప్రణయనగరిలో ప్రపంచ క్రీడలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, రామకృష్ణ చంద్రమౌళి, ఉమాశేషారావు వైద్య, పరిమి వెంకట సత్యమూర్తి, రేవిణిపాటి రమాదేవి, కపిలవాయి అశోక్ బాబు, లక్ష్మారెడ్డి  పసుల, జె.వి.కుమార్ చేపూరి, కనపర్తి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2024 ఆగస్టు 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Tuesday, 6 August 2024

సుప్రసిద్ధ కవి శివారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...

ప్రసిద్ధకవి శివారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో....

బహుశా నేను అప్పుడు ఇంటర్ ఫస్టియర్లో ఉన్నాను. ఒక షైనీ మార్నింగో, ఒక ఫైన్ ఈవినింగో గుర్తులేదు కానీ మా గురువు గారు హిమజ్వాల (ఇరివెంటి వెంకట రమణ) గారు నా చేతిలో ఒక పుస్తకం పెట్టారు చదవమని. పుస్తకం పేరు ‘మోహనా! ఓ మోహనా!'. అలా జ్వాలలాంటి పుస్తకాన్ని మొదట పరిచయం చేసింది హిమజ్వాల గారు. శివారెడ్డి గారి పుస్తకాలతో తొలి పరిచయమది.

అలా నా చేతిలో పడ్డ పుస్తకం కొన్ని రోజుల పాటు నాకు బ్రేక్ ఫాస్టు, లంచ్, డిన్నర్ గా మారింది. ఆ పుస్తకం చదివిన ఊపులో 30కి పైగా కవితలను (నిజంగా కవితలంటారో, లేదో తెలియదు) రాసేసి హిమజ్వాల గారికి చూపించాను. ఆయన పచ్చ జెండా ఊపగానే అటు నుండి అటే ఎర్రరంగు ఆఫీసు(పోస్టాఫీసు)కి వెళ్ళిపోయి శివారెడ్డి గారికి ఆ కవితలను పోస్టు చేశాను. శివారెడ్డి గారి కవిత్వంతో మొదటిసారి మమేకమైన సందర్భమది. ' ఉత్త పోస్టుమాన్ మీద ఊహలు రానేరావు' అని తిలక్ చెప్పడం గుర్తున్నా నా ఊహలన్నీ 'పోస్ట్' అన్న పిలుపు చుట్టే. కొన్ని రోజులు ఏ ఇంటిముందు 'పోస్ట్' అనే పిలుపు వినబడ్డా 'ఆ ఉత్తరం నాకేనేమో' అనే భావన నిలవనీయలేదు. ఆ నిరీక్షణ మరీ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎంతో ఎదురు చూసిన పోస్టు రానే వచ్చింది. స్వదస్తూరీతో శివారెడ్డి గారు రాసిన ఉత్తరమది. 'చదువు పోకుండా సాహిత్య అధ్యయనం చేయండి' అన్న ఆయన హితోక్తిని ఆచరణలో పెట్టాను. 'మీ కవిత్వంలో స్పార్క్ ఉంది' అన్న శివారెడ్డి గారి దస్తూరీలోని వాక్యాన్ని ఎన్నిసార్లు చదివానో గుర్తులేదు కానీ ఆ వాక్యం నాలో ఎంత ఆనందాన్ని నింపిందో గుర్తుంది. ఆ సంబురం ఇంకా నా మెదడు పొరల్లో భద్రంగా ఉంది. అవి ఆయన దస్తూరీతో తొలి సంతోషకర క్షణాలు నాకు.

ఈ సంఘటన తర్వాత శివారెడ్డి గారు అప్పటికే రాసిన 'ఆసుపత్రి గీతం', 'భారమితి' కవితాసంపుటాలనూ చదివాను. ఆ తర్వాత మంజీరా రచయితల సంఘం శివారెడ్డి గారి కవిత్వాన్ని ఆయన గొంతుతో క్యాసెట్ రూపంలో తెచ్చింది. ఆ క్యాసెట్ కొని విన్నాను. ఆ కవిత్వాన్ని మనసారా ఆస్వాదించాను. అలా శివారెడ్డి గారి గొంతుతో మొదటి పరిచయం.

నా మకాం రాష్ట్ర రాజధానికి మారిన తర్వాత అనేక పర్యాయాలు ఆయనను వివిధ సందర్భాల్లో కలిశాను. ఆయన చిరునవ్వుల పలకరింపును, ఆత్మీయ ఆలింగనాన్ని ఎన్నోమార్లు చవిచూశాను. 'వార్త'లో సబ్ ఎడిటర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు అనేకసార్లు ఆయనను కలిశాను. 'టు బి ఆర్ నాట్ టు బి', 'వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ' అనే సందిగ్ధ పరిస్థితుల్లో వనస్థలిపురం పార్కులో ఆయన గీతోపదేశం శ్రద్ధగా విన్నాను. జీవితంలోని అనేక సందర్భాల్లో పనికొచ్చే పరిష్కార మార్గాలు ఆయన గొంతులోనే ఇప్పటికీ సందిగ్ధ సమయాల్లో నా అంతరంగంలో సుడులు తిరుగుతాయి. ఈరోజు శివారెడ్డి గారి పుట్టినరోజు. మూడు పాతికల వయస్సైనా ఉత్సాహంలో ఆయన పాతికేళ్ల కుర్రాడే. 270 డిగ్రీలు తిరిగిన ఆ జీవన గడియారం 360 డిగ్రీలు పూర్తి చేయాలి. సెంచరీ నాటౌట్ వీరుడిగా నిలవాలి. నాలాంటి మరెందరిలోనో స్ఫూర్తిని నింపాలి. 

వీరుడా! నీ ‘జైత్రయాత్ర' కొనసాగించు. 'అజేయం’గా నిలబడు. 'రక్తం సూర్యుడి'కి ప్రతిరూపంగా భాసించు. పుట్టినరోజు శుభాకాంక్షలు శివారెడ్డి సార్...

 (గతంలో పెట్టిన పోస్టు మరోసారి.. శివారెడ్డి సార్ పుట్టినరోజు సందర్భంగా)